రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- December 21, 2025
రియాద్: సౌదీ అరేబియా రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే కావడంపై సమీక్షి నిర్వహించారు. శుక్రవారం దాదాపు 200 విమానాలు ఆలస్యంగా లేదా రద్దు చేసిన విషయంపై ఆయన ఆరా తీశారు. ఆయనతో పాటు GACA అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్, రియాద్ విమానాశ్రయాల కంపెనీ CEO అయ్మాన్ అబు అబా మరియు సీనియర్ విమానాశ్రయ అధికారులు ఉన్నారు. విమానాశ్రయ సౌకర్యాలను సందర్శించి, ప్రయాణీకుల రాకపోకలను పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచాలని మరియు అత్యున్నత భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల హక్కుల రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







