ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!

- December 21, 2025 , by Maagulf
ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!

కువైట్: కువైట్ లో శుక్రవారం సాయంత్రం ముబారక్ అల్-కబీర్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.  అగ్నిప్రమాదంలో ఒక మహిళ మరియు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

అల్-ఖురైన్ మరియు అల్-బైరాక్ అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇంటిని పూర్తిగా ఖాళీ చేయించి, మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో ఒక మహిళ మరియు ఇద్దరు పిల్లలతో సహా ముగ్గురు మరణించగా, మరో ఐదుగురిని రక్షించారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com