దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు

- December 23, 2025 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు

దుబాయ్: యూఏఈలోని క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ నీలా సామ్యూల్ రత్నం ఆధ్వర్యంలో దుబాయ్ దెయిరా క్రీక్‌లో Dhow Cruiseలో 2025 క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నాలుగు వందల కుటుంబాలు, వారి పిల్లలతో కలిసి పాల్గొని, ఉల్లాసభరితమైన వేడుకలను జ‌రుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా టి.డి. జనార్దన్ (టీడీపీ పొలిటికల్ సెక్రటరీ, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆంధ్రప్రదేశ్) మరియు నిమ్మల రామనాయుడు (టీడీపీ – మినిస్టర్ ఫర్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగీకులుగా డా. నోవా (చీరాల), పాస్టర్ కె.సుదర్శన్ (కువైట్), పాస్టర్ సెల్వరాజు, పాస్టర్ అశోక్ కుమార్ పాల్గొని సందేశాలు అందించారు.

ప్రార్థనలు, కీర్తనలు, పాటలతో పాటు, పాస్టర్ సరేళ్ళ యేసు, సిస్టర్ మేరి జ్యోతి, సిస్టర్ ఎస్తేర్ ఆధ్వర్యంలో బ్రదర్ అరవింద్ వుడ్స్ మరియు సంగీతబృందం క్రిస్మస్ క్యారెల్స్ తో కార్యక్రమాన్ని అందరికీ ఆనందంగా తీర్చిదిద్దారు.

క్రిస్మస్ వేడుకల్లో దుబాయ్‌లోని వివిధ సంఘాల పాస్టర్స్, సంఘ పెద్దలు, సామాజిక కార్యకర్తలు, టీడీపీ ఎన్.ఆర్.ఐ.టీం సభ్యులు వాసురెడ్డి,రవి కిరణ్, ప్రసాద్ ధారపనేని,లక్ష్మి పొట్లూరి,సురేందర్, నిరంజన్,వరప్రసాద్,శ్రీకాంత్ చిత్తర్వు(ఎడిటర్-ఇన్-చీఫ్ మాగల్ఫ్ న్యూస్),హరీష్ ముక్కర,బ్రదర్ గల్లి శ్రీనుబాబు (ఓషన్ స్టార్-MD), శ్రావణి శెట్టి, బ్రాహ్మి తళ్లూరి, కృష్ణా రెడ్డి మూడే, ప్రమోద్ కుమార్, పాస్టర్ అడిదల సంపదరావు, పాస్టర్ బండి ఐజాక్, బ్రదర్ శశికిరణ్ ఫ్యామిలీ, బ్రదర్ సతీష్ ఏలేటి, బ్రదర్ శాంత రత్నరాజు కారెం, జోయల్ మీడియా టీమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలు దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి కోసం సాంస్కృతిక ఐక్యత, స్నేహభావం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించే ఘన కార్యక్రమంగా నిలిచాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com