కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

- January 10, 2026 , by Maagulf
కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అమెరికా లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించేందుకు ఆహ్వానం ఇచ్చింది.ఈ ప్రతిష్టాత్మక ఆహ్వానం, హైదరాబాద్, తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంలో కేటీఆర్ చేసిన కృషికి గుర్తింపుగా భావించబడుతోంది.

ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో “The India We Imagine” థీమ్‌లో జరుగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు, పాలసీ మేకర్లు, సాంస్కృతిక నిపుణులు, అంతర్జాతీయ కూటమీ నాయకులు పాల్గొని భారతదేశం భవిష్యత్తు, ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధి అవకాశాలపై చర్చిస్తారు.

కేటీఆర్(KTR) హార్వర్డ్‌లో ప్రసంగించడం తెలంగాణ, హైదరాబాద్ పై ఉన్న అంతర్జాతీయ ఆసక్తిని పెంచే అవకాశంనిస్తుంది. సాంకేతిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతులు, పెట్టుబడులు, నూతన వ్యూహాలు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడతాయి.

కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పరిశ్రమ, ఐటీ, హెల్త్‌కేర్, ఇన్నోవేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి, యువతకు అవకాశాలు, స్మార్ట్ సిటీల నిర్మాణం వంటి విషయాలు ప్రపంచ దృష్టికి తీసుకెళ్తారు. ఇది రాష్ట్రం పెట్టుబడులకు, వాణిజ్య అవకాశాలకు గాను అంతర్జాతీయ గుర్తింపును పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ సదస్సు ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు భారతదేశ భవిష్యత్తు, సామాజిక మరియు ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని, అలాగే యువతకు ప్రేరణ లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com