బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!

- January 10, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!

మనామా: బహ్రెయిన్ లో స్ట్రీట్ విక్రయాలను నిర్వహించడానికి బహ్రెయిన్ పౌరులకు మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బహ్రెయిన్ వాసులకు మంజూరు చేసిన  లైసెన్స్‌లు ఇతరుల పేరిట బదిలీ కావని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రి వేల్ అల్ ముబారక్.. పార్లమెంటులో MP జలాల్ కాదేమ్‌కు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

స్ట్రీట్ వెండర్స్ వారికి కేటాయించిన స్థలంలో మాత్రమే పనిచేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ లను సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించారు.  ప్రస్తుతం, బహ్రెయిన్ లో 31 మంది లైసెన్స్ పొందిన విక్రేతలు ఉన్నారు. 2023లో 10 లైసెన్సులు, 2024లో ఏడు మరియు 2025లో 14 లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ముహారక్ మునిసిపాలిటీ ఒక లైసెన్స్‌ను సస్పెండ్ చేసిందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com