షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!

- January 11, 2026 , by Maagulf
షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!

షార్జా: షార్జాలో తప్పిపోయిన పెట్ డాగ్ ను దాదాపు నెల రొజుల తర్వాత గుర్తించారు. అల్ ఖాన్ కార్నిష్‌కు ఎదురుగా ఉన్న ఒక టవర్‌లోని 50వ అంతస్తులో నివసిస్తున్న వాలంటీర్ తస్మియా ఇచ్చిన సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.రెడ్ పాస్ అనే కమ్యూనిటీకి చెందిన వాలంటీర్ తస్మియా డాగ్ రెస్క్యూ ఆపరేషన్ లోనూ స్వయంగా పాల్గొన్నారు. సమీపంలో నివసిస్తున్న కమ్యూనిటీ సభ్యులకు కూడా సహాయం కోసం పిలుపునిచ్చారు. 

అయితే, డాగ్ ఉన్న ఆ ద్వీపానికి చేరుకోవడానికి వారికి పడవ అవసరం. ఆ సమయంలోనే, సహాయం కోసం చేసిన పిలుపును చూసిన షార్జాకు చెందిన పాడిల్ ట్రైబ్ స్పోర్ట్స్ జట్టుకు చెందిన ఒక డ్రాగన్ బోట్ రేసర్ తస్మియాను సంప్రదించాడు. సుమారు 20 మంది సభ్యులున్న ఈ బృందం రాబోయే పోటీ కోసం సాధన చేయడానికి ప్రతి వారాంతంలో సూర్యోదయానికి ముందే అల్ ఖాన్ కార్నిష్ వద్ద నీటిలోకి దిగుతుందని తెలిపాడు.  

తస్మియా సోషల్ మీడియా పోస్ట్ చేసిన 24 గంటలలోపే, ఒక రెస్క్యూ ప్లాన్ సిద్ధమైంది. ద్వీపం అంతటా పరుగెడుతూ తనను రక్షించడానికి వచ్చిన వారికి చుక్కలు చూపించింది. 

అల్ తవూన్ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీలంక దంపతులు ఆ డాగ్ ను పెంచుకుంటున్నట్లు, తాము ఇంట్లో లేనప్పుడు అది  తప్పిపోయిందని షార్జా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  డిసెంబర్ 7న మెలీని కోల్పోయినట్లు పేర్కొన్నారు.  దాని ఆచూకీని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.  చివరకు ఆ డాగ్ ను పట్టుకొని పశువైద్యుని వద్దకు తీసుకొచ్చారు. అయితే , పొదలు మరియు ముళ్ళతో కప్పబడిన ఇసుక ద్వీపంలో చిన్న కుక్క ఎలా వచ్చిందనేది మిస్టరీగా మిగిలిపోయింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com