సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- January 11, 2026
జెడ్డా: ఇజ్రాయెల్ సోమాలిలాండ్ అని పిలవబడే ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించిన తర్వాత సోమాలియాలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రుల మండలి జెడ్డాలోని OIC జనరల్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో సమావేశమై చర్చించారు.
ఈ సందర్భంగా OIC సెక్రటరీ జనరల్ హుస్సేన్ తాహా మాట్లాడుతూ.. సోమాలియా సార్వభౌమాధికారం పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ చర్య ఒక ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
OIC చార్టర్, అంతర్జాతీయ చట్టం మరియు సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల ఆధారంగా సోమాలియాకు మద్దతుగా నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలస్తీనాలోని పరిణామాలను కూడా ప్రస్తావించారు. కాల్పుల విరమణ ఒప్పందం రెండవ దశకు ముందుకు సాగాలని, తద్వారా శాశ్వతమైన ముగింపు పలకాలని, గాజా స్ట్రిప్ నుండి పూర్తిగా వైదొలగాలని ఇజ్రాయెల్‌ను కోరారు. ఈ మేరకు తీర్మానాలను OIC దేశాల విదేశాంగ మంత్రుల మండలి ఆమోదించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







