ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- January 14, 2026
దోహా: దోహాకు జిసిసి టూరిజం క్యాపిటల్ టైటిల్ లభించడం యాదృచ్ఛికం కాదని ఖతార్ టూరిజం ఛైర్మన్ మరియు విజిట్ ఖతార్ బోర్డు ఛైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ అన్నారు. ప్రత్యేకించి పర్యాటక రంగంలో ఖతార్ చేసిన గొప్ప ప్రయత్నాలకు జిసిసి జనరల్ సెక్రటేరియట్ ఇచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. దీనివల్ల దోహా ఈ రోజు గల్ఫ్ కుటుంబాలకు ఇష్టమైన గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు.
గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఫోరమ్ 2026 రెండవ రోజు జరిగిన సమావేశంలో అల్ ఖర్జీ మాట్లాడుతూ.. భద్రత మరియు రక్షణ పరంగా ఖతార్ ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటి అన్నారు. 2025లో ఖతార్‌కు వచ్చిన సందర్శకులలో 35 శాతం మంది గల్ఫ్ దేశాల నుండి వచ్చారని తెలిపారు. గల్ఫ్ నగరాల నుండి ఖతార్‌కు వారానికి 400 కంటే ఎక్కువ విమాన సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం హోటల్ ఆక్యుపెన్సీ రేటు 71 శాతంతో అత్యధికంగా నమోదైందని ఆయన తెలిపారు. మరోవైపు, జిసిసి రాజధానుల మధ్య పర్యాటక పోటీ ఆరోగ్యకరమైనదని మరియు అందరికీ ప్రయోజనకరమని అల్ ఖర్జీ అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







