పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!

- January 17, 2026 , by Maagulf
పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!

అమెరికా: అమెరికాలో అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) చేపడుతున్న దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలో మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ‘మెట్రో సర్జ్’ ఆపరేషన్‌లో భాగంగా ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

జనవరి 8న రిచ్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఇద్దరు యువకులను ICE ఏజెంట్లు ఒక్కసారిగా చుట్టుముట్టి కింద పడేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. మొదట వారిని అక్రమ వలసదారులుగా అనుమానించిన అధికారులు, విచారణలో వారు చట్టబద్ధమైన విద్యార్థులని గుర్తించారు. అయినప్పటికీ గంటల తరబడి విచారించి, వారి వీసా, ఐ-20 పత్రాలను పరిశీలించినట్లు సమాచారం.

ఈ ఘటన పై మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మైఖేల్ హోవార్డ్ తీవ్రంగా స్పందించారు. చర్మవర్ణం, మాట్లాడే భాష ఆధారంగా విద్యార్థులను టార్గెట్ చేయడం అన్యాయమని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. కేవలం అనుమానంతో భారతీయ మూలాలున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జాతి వివక్షకు ఉదాహరణగా పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com