బ్రైన్ స్ట్రోక్ గురించి తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

- July 28, 2016 , by Maagulf
బ్రైన్ స్ట్రోక్ గురించి తెలుసుకొని  ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

మెదడులోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినప్పుడు ... ఆ భాగానికి ఆక్సిజన్ , పోషక పదార్దాలు అందకపోవడం వలన ఆ భాగములోని మెదడు కణాలూ నిర్జీవమవడం వలన ... తత్సంబంధిత శరీర భాగాలు పనిచేయక పోవదాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్‌కూడా గుండెపోటు లాగానే ఒక అత్యవసర వైద్య స్థితి. స్ట్రోక్ లక్షణాలు ముందుగా సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్స లభించి వ్యక్తికి ప్రాణ భయం ఉండదు . వ్యక్తికి స్ట్రోక్ రాకపోయినా ఇక ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తిస్తే , స్ట్రోక్‌ను నిరోధించడానికి వీలుంటుంది .ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . మెదడకు స్ట్రోక్ అంటే బ్రైన్ స్ట్రోక్ గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం... క్రింద నుదహరించిన చికిత్సా విధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... స్ట్రోక్ రకాలు : స్ట్రోక్‌లో రెండు ప్రార్ధన రకాలున్నాయి . ఒక్కోదానికి ఒక్కో కారణం ఉన్నది.1. మెదడుకు రక్తం సరఫరాచేసే రక్తం గడ్డకట్టి అవరోధం ఏర్పడితే ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది . కొవ్వు నిక్షేపాలు , కొల్రెస్టాల్ .. కారణంగా ఈ మార్గం ముడుచుకు పోయి గట్టిపడుతుంది. 2. మెదడులోని ఒక నాళంలో రంధ్రాలు ఏర్పడటమో, చిట్లి పోవడమో జరిగితే హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది . అధిక రక్తపోటు వల్ల ,నాళం గోడలు పలుచబడి పోవడం వల్ల మెదడులో రక్తస్రావం జరుగవచ్చును.కారణాలు : 65 ఏళ్ళు దాటినవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో ట్రాన్స్ సియంట్ ఇస్కీమిక్ ఎటాక్ రికార్డు ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్త పోటు, అధిక కొలెస్టిరాల్, క్రమబద్ధంగా గుండె కొట్టుకోకపోవడం, గుండె రక్తాన్ని సరిగా పంపించకపోవడం, గతంలో గుండె పోటు వచ్చి ఉంటే ..మధుమేహము, స్థూలకాయం, సంతాన నిరోధక మాత్రలు వాడడం, ఎక్కువగా పొగత్రాగడం వంటివి స్ట్రోక్‌కు దారి తీయవచ్చును.స్ట్రోక్ రాకుండా జాగ్రత్తలు :సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు .. తరచగా వైద్య పరీక్షలు చేసుకోవాలి.పండ్లు ,కాయగూరలు, తృణధాన్యాలు ,వంటి ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవాలి ,క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, అధిక బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి, పొగ, మత్తుమందులు, మద్యపానీయా లకు దూరంగా ఉండాలి. అలాగే మానసిక వత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి.లక్షణాలు : శరీరములో కుడివైపో, ఎడమ వైపో ముఖ్యంగా మొహం,చెయ్యి, కాలుచచ్చుపడిపోయినట్లు అనిపించడం, బలహీన పడినా, మాట్లాడడంలో మేస రావడం,మాటలు అర్ధం చేసుకోవదానికు ఇబ్బందిపడినా, కంటిచూపు మందగించినా , వక్రీకరించినా, ఒక వస్తువు రెండుగా కనిపించినా, కారణం లేకుండా అతిగా అసాధారణంగా తలనొప్పి వచ్చినా, పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ,తనికీలు : సి.టి.స్కాన్ , యమ.అర్.ఐ, జనరల్ బ్లడ్ టెస్టులు... చేసుకోవాలి.చికిత్స : స్ట్రోక్ కనిపించిన 3 గంటలలో చికిత్స ప్రారంభించాలి. రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల స్ట్రోక్ వస్తే .. థ్రొమ్ మెటబాలిక్ మందులు ఇస్తారు . రక్తం గడ్డకట్టడాన్ని నిదానం చేసే మందులూ ఇస్తారు. తీవ్రమైన స్ట్రోక్ వస్తే గంటల లోపు ఆపరేషన్ అవసరం కావచ్చు. డాక్టర్‌ని సంప్రదించడం ఎంత తొందరగా జరిగితే అంత మంచిది .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com