CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు

- January 18, 2026 , by Maagulf
CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు

విశాఖపట్నం: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 సీజన్‌ను Telugu Warriors ఘనంగా ఆరంభించింది. శనివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో *Punjab De Sher* పై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ Akhil Akkineni అజేయ సెంచరీతో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అఖిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 56 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి అశ్విన్‌బాబు 60 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ (Akhil Akkineni century) జట్టు తెలుగు వారియర్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కరణ్‌వాణి (56) మినహా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 18.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వినయ్ మహదేవ్ మూడు వికెట్లు, సామ్రాట్ రెండు వికెట్లతో కీలక పాత్ర పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com