75కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రం 'జాగ్వార్'..
- July 28, 2016
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ని జులై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్‌లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. బాహుబలి, భజరంగి భాయ్‌జాన్ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' తీసిన ఎ. మహదేవ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ చిత్రానికి పాటలు రాశారు. హెచ్.డి. కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీప్తి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







