'కాన్ సిటీ' టైటిల్ & ఫస్ట్-లుక్‌

- January 19, 2026 , by Maagulf
\'కాన్ సిటీ\' టైటిల్ & ఫస్ట్-లుక్‌

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ లాంచ్  చేశారు.

ఈ చిత్రంలో అర్జున్ దాస్  ప్రధాన పాత్రలో కనిపించగా, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్, కామెడీ కింగ్ యోగి బాబు, వెటరన్ నటి వడివుకరసి తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ అకిలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

పవర్ హౌస్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది, హరీష్ దురైరాజ్  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

లోకేష్ కనగరాజ్ లాంచ్ చేసిన టైటిల్ & ఫస్ట్-లుక్ పోస్టర్ మధ్యతరగతి కుటుంబం మనసుని తాకేలా ప్రజెంట్ చేస్తోంది.

అర్జున్ దాస్ ఆఫీస్ బ్యాక్‌ప్యాక్‌తో అన్నా బెన్ హ్యాండ్‌బ్యాగ్‌తో యోగి బాబు, వడివుక్కరసి ట్రావెల్ బ్యాగ్స్‌తో చిన్నారి అకిలన్ విజయాన్ని సూచించే ట్రోఫీని తీసుకెళ్లడం క్యురియాసిటీ పెంచింది. తాజా టైటిల్, పోస్టర్ అద్భుతమైన స్పందనను పొందాయి.

ఈ సినిమా మంగళూరు, చెన్నై , ముంబైలలో షూటింగ్ 80% పూర్తయింది.

ఈ చిత్రం తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలవుతోంది.

సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం: హరీష్ దురైరాజ్
నిర్మాణం: పవర్ హౌస్ పిక్చర్స్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: అరుల్ మోసెస్ ఎ
సంగీతం: సీన్ రోల్డాన్
ప్రొడక్షన్ డిజైనర్: రాజ్ కమల్
కాస్ట్యూమ్ డిజైన్: నవా రాంబో రాజ్ కుమార్
స్టంట్స్: యాక్షన్ సంతోష్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com