బెంగాలి స్టైల్ ట్రెడిషనల్ ఫిష్ కాలియా
- July 28, 2016
సాధారణంగా చేపలు వంట్లో చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి. కాబట్టి, మనం వెరైటీ టేస్ట్ ను రుచి చూడాలంటే, మన పక్కన రాష్ట్రల వంటలను ప్రయత్నించవచ్చు . బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో ఫిష్ కాలియా రిసిపి అంటారు. ఈ ఫిష్ కాలియా చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే మన స్టైల్లో ఈ ఫిష్ కర్రీని, కోకోనట్ మిల్క్ ఉపయోగించి ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మచ్చర్ జాల్ ఫిష్ కర్రీకి చిన్న చేపలు, తెలాపియ, పబ్దా, టాగ్రా మొదలగు చేపలతో ఎక్కువగా వండుతారు. ఫిష్ కాలీయా రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఎలా తయారుచేయాలో చూడండి.. కావల్సిన పదార్థాలు: రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) - 4 pieces బంగాళదుంపలు - 2 మధ్యతరహా (భాగాలుగా కట్) ఉల్లిపాయలు - 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) టమోటోలు - 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) నిమ్మరసం - 1 teaspoon పెరుగు - 1 teaspoon అల్లం పేస్ట్ - 2 teaspoon వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoon పచ్చిమిర్చిపేస్ట్ - 2 teaspoon ఆవనూనె - 4-5 టీస్పూన్ టమోటో గుజ్జు - 1 teaspoon పసుపు - 1/4 teaspoon జీలకర్ర పొడి - 1 teaspoon కారం - రుచి ప్రకారం ఉప్పు - రుచి ప్రకారం పంచదార - 1 teaspoon గరం మసాలా - 1/2 teaspoon బిర్యానీ ఆకు- 2 మసాలా దినుసులు - (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2) ఎండుమిర్చి - 1 (optional) ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) - 1/4 teaspoon నెయ్యి - ½ TSP నీళ్ళు కొత్తిమీర గార్నిష్ కోసం తయారుచేయు విధానం: 1. ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 2. తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 3.ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి . 4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 5. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 6. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది. 7. ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 8. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి. 9. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి. 10.చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి . తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









