విద్యాబాలన్‌ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక ..
- July 28, 2016
తెలుగు తెరపై అలనాడు ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువై తల్లిగా.. చెల్లిగా.. ఆత్మీయురాలిగా వారి గుండెల్లో నిలిచిపోయింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను.. కష్టనష్టాలను చవిచూశారు. చివరకు విషాద పరిస్థితుల్లోనే తనువు చాలించారు.
అయితే ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారట.బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాబాలన్‌ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. సావిత్రిలాగే ఆమెకు కూడా తెలుగు.. తమిళం.. హిందీ.. వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.''సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీల్లో ఎవ్వరూ మహానటి అని పిలిపించుకోలేకపోయారు. ఆమె జీవితకథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







