నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం

- January 25, 2026 , by Maagulf
నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం

అమెరికా: వైద్య రంగంలో విశ్వప్రఖ్యాతి పొందిన మన తెలుగుబిడ్డ డాక్టర్ నోరి దత్తత్రేయుడుకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిందని నాట్స్ (North American Telugu Society) హర్షంగా ప్రకటించింది. వేల మంది ప్రాణాలను రక్షించిన వైద్య సేవలకు ఇది గౌరవార్థక గుర్తింపు అని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల పేర్కొన్నారు.

నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి మాట్లాడుతూ, అమెరికాలోనూ డాక్టర్ నోరి సేవలకు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాయని, ఆయన వేల మందికి ప్రాణదాతగా నిలిచారని తెలిపారు.

ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ఘనత అని నాట్స్ అధ్యక్షుడు అన్నారు. అలాగే, తెలుగు సినీ రంగంలోని ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీమోహన్లకు పద్మ పురస్కారాలు లభించడం వారి నటనా ప్రతిభకు, కళారంగంలో చేసిన సేవలకు అసలైన గుర్తింపు అని నాట్స్ కొనియాడింది.

ఇతర రంగాల్లో పద్మశ్రీ పురస్కారాలను అందిన తెలుగు ప్రతిభలలో:

సైన్స్ & ఇంజనీరింగ్: కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), రామారెడ్డి మామిడి (పశుసంవర్ధక, మరణానంతరం), వెంపటి కుటుంబ శాస్త్రి

వైద్యం: పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకటరావు

కళలు & నృత్యం: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, దీపికా రెడ్డి

సాహిత్యం: గడ్డమనుగు చంద్రమౌళి

శాస్త్ర సాంకేతిక రంగం: పాడి పరిశ్రమ

నాట్స్, ఈ ప్రతిభావంతులందరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, తెలుగువారి ప్రతిభకు భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com