పడవల సహాయంతో వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం
- July 29, 2016
దక్షిణాదినా భారీ వానల జోరు మొదలైంది. హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా తరచుగా పడ్డ వానలకు ట్రాఫిక్ జామ్‌లతో, గుంతలు పడ్డ రోడ్లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిన గుడ్‌గావ్ నగరం నిన్నటి నుంచి వాహనదారులకు నరకం చూపిస్తోంది. తాజాగా బెంగుళూరులో భారీ వర్షాలు మొదలయ్యాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం, గాలి కారణంగా చెట్లు విరిగి పడిపోవడం కూడా ట్రాఫిక్ అంతరాయానికి కారణమైంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







