దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్‌గావ్‌కు రావొద్దని ...

- July 29, 2016 , by Maagulf
దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్‌గావ్‌కు రావొద్దని ...

భారీ వర్షాల కారణంగా హరియాణాలోని గుడ్‌గావ్‌ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ ఆగిపోయింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి గత రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు కూడా వర్షం కురుస్తుండడంతో పరిస్థితి మెరుగుపడే అవకాశం సన్నగిల్లింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. కార్లు నీటిలో మునిగిపోయాయి. దిల్లీ-గుడ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, సోహ్నా రోడ్డుపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రజలు నానా అవస్థలు పడ్డారు.దిల్లీ నుంచి ఎవ్వరూ గుడ్‌గావ్‌కు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి కాస్త చక్కబడే వరకు పాఠశాలలు తెరవద్దని, ప్రజలు రోడ్లపైకి రావద్దని అధికారులు సూచించారు. గుడ్‌గావ్‌లోని పోలీసులందరూ ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలోనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని గుడ్‌గావ్‌ కమిషనర్‌ నవదీప్‌ సింగ్‌ విర్క్‌ తెలిపారు. హరియాణాలోని ఉన్నత స్థాయి అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ ఫొటోలను ప్రజలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కూడా జలమయమైన గుడ్‌గావ్‌ రోడ్ల ఫొటోలను ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com