మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!

- January 27, 2026 , by Maagulf
మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!

మనమా: బహ్రెయిన్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోగా, మరో ప్రయాణికురాలు గాయపడినట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. సుమారు ఉదయం 5:34 గంటలకు నిందితుడు తన స్నేహితులతో కలిసి చట్టబద్ధమైన పరిమితి కంటే 30% అధిక వేగంతో వాహనం నడిపిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మద్యం సేవించి ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా లేన్ మార్చాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టాడు.  అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్డాడు. అందులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరోకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  

మొదటి హై క్రిమినల్ కోర్టు ముందు హాజరైనప్పుడు, నిందితుడు తనపై మోపబడిన అభియోగాలను అంగీకరించాడు.  అతివేగంగా వాహనాన్ని నడపడం అనే నిర్దిష్ట అభియోగాన్ని తిరస్కరించాడు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఒక వ్యక్తి మరణించడం మరియు మరొక వ్యక్తి గాయపడటం, వేగ పరిమితిని మించి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి నేరాలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగం మోపింది. ప్రజా ఆస్తికి నష్టం కలిగించినందుకు కూడా అతనిపై కేసులు నమోదు చేశారు.  తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి కోర్టు షెడ్యూల్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com