భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- February 02, 2026
పాకిస్తాన్: టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 WC) లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.పీసీబీ నిర్ణయాన్ని విచారకరమని పేర్కొన్న అఫ్రిది.. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ, ఈ వ్యవహారంలో ఐసీసీ న్యాయంగా వ్యవహరించాలని కోరారు.
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించిన విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్‌ను దూరం పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.ఈ అంశంపై అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “రాజకీయాలు మూసే తలుపులను క్రికెట్ తెరుస్తుంది అని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం. అయినా ప్రభుత్వ నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు ఐసీసీ మాటలతో కాదు, నిర్ణయాలతో న్యాయం చూపించాల్సిన సమయం ఇది” అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్‌లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్‌మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్‌పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!







