JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- February 02, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో (NITs) బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్–2026 (JEE Main 2026) పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నిర్వహించనున్న సెషన్–2 పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది
ఇందులో భాగంగా,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేసింది. సెషన్-2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ సహా 13 భాషల్లో నిర్వహించబడతాయి. గత మూడు సంవత్సరాలలో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లు, ఇతర అప్డేట్ల కోసం NTA JEE వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







