స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- February 05, 2026
యూఏఈ: 2026-27 విద్యా సంవత్సరంలో కొత్త ప్రవేశాల కోసం కొత్త ఏజ్ లిమిట్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలో ప్రవేశాలు మరియు సంసిద్ధత గురించి పేరెంట్స్ స్పష్టత కోరుతున్నారు. గతేడాది డిసెంబర్లో విద్యా మంత్రిత్వ శాఖ (MoE) బ్రిటిష్ కరికూలం ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ వన్ (FS1)లో చేరడానికి విద్యార్థుల వయస్సు ప్రవేశ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి మూడు సంవత్సరాలు నిండి ఉండాలని, గతంలో ఉన్న ఆగస్టు 31 కటాఫ్ తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) వెబ్సైట్ ప్రకారం, కొత్త ఏజ్ లిమిట్ అర్హత కటాఫ్ తేదీలు 2026–27 విద్యా సంవత్సరం నుండి అమలులోకి వస్తాయి. ప్రీ-కిండర్‌గార్టెన్, KG 1 / FS2, KG 2 / ఇయర్ 1, గ్రేడ్ 1 / ఇయర్ 2 లేదా వాటికి సమానమైన పాఠ్యప్రణాళికలలో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే వర్తిస్తాయి.
అయితే, ఇప్పటికే ప్రకటించిన ప్రవేశాలకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని కొంతమంది తల్లిదండ్రులు భావించారు. ఇప్పుడు స్కూల్స్ అడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు. స్కూల్స్ ఈ మార్పులను అమలు చేయడం ప్రారంభించడంతో.. ఇప్పటికే ఖరారు చేసుకున్న అడ్మిషన్ ప్రణాళికలను తిరిగి సమీక్షించాల్సి వస్తోందని కొందరు చెబుతున్నాయి.
సవరించిన ఏజ్ కటాఫ్ తన ఇద్దరు పిల్లల ప్రవేశాలపై ప్రభావం చూపిందని ఇద్దరు చిన్న పిల్లల తల్లి అయిన ఇషాంక వాహి చెప్పారు. అక్టోబర్ 2022లో జన్మించిన తన పెద్ద కొడుకు, వాస్తవానికి సెప్టెంబర్ 2026లో FS1లో చేరడానికి పేరు నమోదు చేశాను. కానీ కొత్త విధానం ప్రకారం, అతను ఇప్పుడు నేరుగా FS2కి వెళ్లాలి. తద్వారా అతను తన తరగతిలో అందరికంటే చిన్నవాడు అవుతాడు. అతని తోటివిద్యార్థులు అతని కంటే 16 నెలల వరకు పెద్దవారు ఉంటారు. తన చిన్న కొడుకును కేవలం 2 సంవత్సరాల 9 నెలల వయస్సులోనే FS1లో చేరమని అడుగుతున్నారని ఆమె తెలిపారు. కనీసం రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లేకుండా ఈ ఆకస్మిక విధాన మార్పు, పిల్లల అభివృద్ధి, విద్య మరియు అటువంటి నిర్ణయాలు అమలు చేయబడుతున్న విధానం గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతుందని వాహి అభిప్రాయపడ్డారు.
ఈ సడెన్ కొత్త మార్పులు తాను ఇప్పటికే పొందిన పాఠశాల ప్లేస్‌మెంట్‌కు అంతరాయం కలిగించాయని మరో తల్లి క్రిస్టినా రుసు చెప్పారు. తన బిడ్డ FS1లో చేరాడని, కానీ తరువాత తన కుమార్తె FS2కి మారవలసి ఉంటుందని, అక్కడ అడ్మిషన్లు అందుబాటులో లేవని ఆమె తెలిపారు. FS2 ఖాళీలు లేనందున తమ డిపాజిట్ ను తిరిగి చెల్లించారు. ఇప్పుడు మా పాపకు సీటు లేకుండా పోయింది. చాలా మంది తల్లిదండ్రుల మాదిరిగానే, తాము ఎన్నడూ అనుకోని విధంగా ఇంటి నుండి దూరంగా ఉన్న స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆమె వాపోయారు. ఈ విషయంలో అథారిటీ క్లారిటీ ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్‌లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్‌కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







