సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- February 05, 2026
భారత దేశంలోని మొబైల్ వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ముసుగులో వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి, స్కామ్ మెసేజ్‌లు పంపుతున్న ‘వింగో’ (Wingo) యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది.
భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జరిపిన లోతైన విచారణలో ‘వింగో’ గేమింగ్ యాప్ అసలు రంగు బయటపడింది. ఈ యాప్ వినియోగదారుల మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని, బాధితులకు కనీసం అనుమానం కూడా రాకుండా వారి ఫోన్ల ద్వారా ఇతరులకు మోసపూరిత సందేశాలను (Scam Messages) పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ భారీ సైబర్ నెట్‌వర్క్‌ను మరియు డేటా చోరీని అరికట్టేందుకు ఐ4సీ తక్షణమే స్పందించి వింగో యాప్‌కు సంబంధించిన సర్వర్లను పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎవరూ కూడా ఈ ప్రమాదకరమైన యాప్‌ను ఇన్స్టాల్ చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పటికే ఎవరి ఫోన్లలోనైనా ఈ యాప్ ఉంటే, భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే దాన్ని తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







