షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!

- February 07, 2026 , by Maagulf
షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!

కువైట్: కువైట్ ఆయిల్ కంపెనీ తన షేల్ ఆయిల్ మరియు గ్యాస్ వనరులను అభివృద్ధిపై డెవాన్ ఎనర్జీ, EOG సహా కొన్ని అమెరికా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు KOC CEO అహ్మద్ అల్-ఈదాన్ తెలిపారు. కువైట్ ఆయిల్ మరియు గ్యాస్ షో సందర్భంగా అహ్మద్ అల్-ఈదాన్ ఈ మేరకు వెల్లడించారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా తక్కువ ఖర్చులతో షేల్ ఆయిల్ మరియు షేల్ గ్యాస్ వనరులను అభివృద్ధి చేయడానికి అనేక కంపెనీలను చర్చలకు ఆహ్వానించామని అల్-ఈదాన్ తెలిపారు.   

OPEC కోటా కింద దాదాపు 2.58 మిలియన్ bpd ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, 2035 నాటికి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 3 మిలియన్ bpd నుండి 4 మిలియన్ bpdకి పెంచాలని భావిస్తున్నట్లు అల్-ఈదాన్ వివరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com