దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్‌..!!

- February 07, 2026 , by Maagulf
దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్‌..!!

దుబాయ్: యూఏఈలో రమదాన్ మాసంలో స్కూళ్లలో ప్రత్యేక షెడ్యూల్ ను అమలు చేయనున్నారు. సాధారణంగా ఫిబ్రవరి 19న రమదాన్ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులను సంప్రదించి పలు స్కూల్స్ ముందస్తు ప్రణాళికలను రూపొందించాయి.    

రమదాన్ మాసంలో ఉపవాసం పాటించే విద్యార్థులు మరియు సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ పనివేళలను సర్దుబాటు చేసినట్టు అంబాసిడర్ స్కూల్ ప్రిన్సిపాల్ షీలా మీనన్ తెలిపారు. వారపు రోజులలో ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, శుక్రవారం మాత్రం ఉదయం 11.30 గంటల వరకు స్కూల్ పనివేళలల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.  జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం వల్ల రమదాన్ నెలలో విద్యాభ్యాసం భారం కాకుండా ఉంటుందని తెలిపారు. 

ఫోర్టెస్ ఎడ్యుకేషన్‌లో భాగమైన రీజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్‌ కూడా ఇలాంటి విధానాన్నే ప్రకటించింది. రమదాన్ అంటే విద్యార్థులు మరియు సిబ్బంది ఇద్దరికీ ముఖ్యమని, వారి ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా స్కూల్ టైమింగ్స్ లో మార్పులు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ డేవిడ్ విలియమ్స్ తెలిపారు.   యూఏఈలో రమదాన్ అనేది అతి ముఖ్యమైనది కావడంతో ప్రతి స్కూల్ కు షెడ్యూల్ సర్దుబాటు అనేది తప్పనిసరి అని ది అమెరికన్ అకాడమీ ఫర్ గర్ల్స్‌ ప్రిన్సిపాల్ లిసా జాన్సన్ అన్నారు. ఇలాంటి పండుగలు విద్యార్థుల్లో చదువుతోపాటు విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com