రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- February 07, 2026
రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025లో పలు రికార్డులను నమోదు చేశాయి. 14 మిలియన్లకు పైగా ప్రయాణికులు రైల్వే సేవలను పొందారు. దీంతో 2023లో నమోదైన 11.2 మిలియన్ల ప్రయాణీకుల రికార్డును బద్దలు కొట్టింది. 2023లో సుమారు 24 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయగా, ప్రస్తుతం 30 మిలియన్ టన్నులకు పైగా సరుకులను రవాణా చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది.
రైల్వే ద్వారా 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రెండు మిలియన్ల ట్రక్కుల రాకపోకలను, 139 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసినట్టు అయిందని అధికారులు తెలిపారు. అలాగే, 364,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రైల్వే భాగస్వామ్యం అయిందన్నారు.
అదే విధంగా, సౌదీ అరేబియా అంతర్జాతీయంగా రైల్వే పలు అవార్డులను సాధించింది. సుదూర పర్యాటక రైళ్లకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) అందించే అవార్డును గెలుచుకున్న మొదటి కంపెనీగా సౌదీ రైల్వే నిలిచింది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









