తెలుగులో ‘చథా పచ్చ’ ఫిబ్రవరి 13న రిలీజ్

- February 07, 2026 , by Maagulf
తెలుగులో ‘చథా పచ్చ’  ఫిబ్రవరి 13న రిలీజ్

రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో షిహాన్ షౌకత్, రితేష్ ఎస్.రామకృష్ణన్ నిర్మాతలుగా అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ:ది రింగ్ ఆఫ్ రౌడీస్’. మలయాళంలో విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ క్రమంలో టీం మీడియా ముందుకు వచ్చి చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

రోషన్ మాథ్యూ మాట్లాడుతూ .. ‘మా ‘చథా పచ్చ’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ టీంకు థాంక్స్. మేం ఎంతో కష్టపడి ఈ సినిమాని తీశాం. మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అద్వైత్‌కి ఇది మొదటి చిత్రం. కథను చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అయితే ఇందులో ఓ స్పెషల్ కేమియో కారెక్టర్ ఉంది. ఆ పాత్రకి మమ్ముట్టి గారిని అప్రోచ్ అవ్వడం, మా కోసం ఆయన అంగీకరించడం గొప్ప విషయం. ఆయన పాత్ర ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది. మా కోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన మమ్ముట్టి గారికి థాంక్స్. మేం పాత్రల కోసం, సినిమా కోసం రెజ్లింగ్ నేర్చుకున్నాం. మేం ప్రత్యేకంగా నాలుగు నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నాం. సినిమాని చూసిన ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు ఆడియెన్స్‌కి కూడా మా మూవీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. ఫిబ్రవరి 13న మా సినిమా రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి ఈ మూవీని చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

విశాఖ్ నాయర్ మాట్లాడుతూ .. ‘మేం ఇలా మొదటి సారిగా హైదరాబాద్‌కు వచ్చి తెలుగులో మా సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాల్ని ఆదరిస్తుంటారు. మా సినిమా ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్‌కి థాంక్స్. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

ఇషాన్ మాట్లాడుతూ .. ‘తెలుగులో సినిమా రిలీజ్ చేయడం, ప్రమోట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. టాలీవుడ్‌కి రావడం అనేది అందరికీ ఓ డ్రీమ్‌లా ఉంటుంది. ‘చథా పచ్చ’ కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. థియేటర్లో చూస్తే కచ్చితంగా మీకు వర్త్ అని అనిపిస్తుంది. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మన గ్యాంగ్‌తో కలిసి సినిమా చూస్తే మరింత ఫీలింగ్ కలుగుతుంది’ అని అన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ .. ‘స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కించిన ‘చథా పచ్చా’ మూవీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతోన్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇలానే మంచి కంటెంట్ సినిమాల్ని అందించేందుకు ప్రయత్నిస్తుంటామ’ని అన్నారు.

నటీనటులు : కార్మెన్ ఎస్ మాథ్యూ, దర్తాగ్నన్ సాబు , వైష్ణవ్ బిజు , శ్యామప్రకాష్ MS , మినాన్, వేదిక శ్రీకుమార్, లక్ష్మీ మీనన్, ఖలీద్ అల్ అమెరి, కృష్ణన్ నంబియార్ , జరీన్ షిహాబ్ , ఓర్హాన్ , ఆల్విన్ ముకుంద్, అర్చిత్ అభిలాష్ , తోష్, టోజ్ క్రిస్టీ తదితరులు

సాంకేతిక బృందం
నిర్మాతలు - షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్
కథ, దర్శకత్వం - అధ్వైత్ నాయర్
కెమెరామెన్ - అనెంద్ సి చంద్రన్
స్క్రీన్ ప్లే, సంభాషణలు - సనూప్ తైకూడం
ఫిల్మ్ ఎడిటర్ - ప్రవీణ్ ప్రభాకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - జార్జ్ సెబాస్టియన్
పీఆర్వో - వంశీ, శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com