జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- February 07, 2026
హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు గోడ పత్రికలను మరియు ఆహ్వాన పత్రికలను శనివారం జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఏ.సి ప్రెసిడెంట్ ఏ.వి.రెడ్డి, ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్,హరికృష్ణ, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.ఉదయం 07.00 గం.ల నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతారు.ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:
తేదీ
17-02-2026
ఉదయం–ధ్వజారోహణం (మేష లగ్నం–ఉ. 10.30–11.00 గంటల వరకు)
రాత్రి–పెద్దశేష వాహనం
18-02-2026
ఉదయం–చిన్నశేష వాహనం
రాత్రి–హంస వాహనం
19-02-2026
ఉదయం–సింహ వాహనం
రాత్రి–ముత్యపుపందిరి వాహనం
20-02-2026
ఉదయం–కల్పవృక్ష వాహనం
రాత్రి–సర్వభూపాల వాహనం
21-02-2026
ఉదయం–పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి–గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)
22-02-2026
ఉదయం–హనుమంత వాహనం
రాత్రి–గజ వాహనం
23-02-2026
ఉదయం–సూర్యప్రభ వాహనం
రాత్రి–చంద్రప్రభ వాహనం
24-02-2026
ఉదయం–రథోత్సవం
రాత్రి–అశ్వవాహనం
25-02-2026
ఉదయం–చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)
రాత్రి–ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)
26.02.2026
మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం.
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









