ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- February 07, 2026
మచిలీపట్నం: వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా అంతర్జాతీయ స్థాయి బందర్ పోర్టును ఏడాది కాలంలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. బందర్ పోర్టు నిర్మాణ పనులను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, సంబంధిత శాఖల అధికారులు, మెఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఎంపీతో కలిసి పర్యటించారు. పోర్టు నిర్మాణ పనుల పురోగతిని మెఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్ ఎంపీకి వివరించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, రానున్న దశలో చేయాల్సిన పనులపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ బాలశౌరి, నిర్ణీత గడువులోగా పోర్టు నిర్మాణం పూర్తి అయ్యేలా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ పోర్టు పూర్తయితే అంతర్జాతీయ వాణిజ్యానికి మచిలీపట్నం కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
పోర్టు నిర్మాణానికి అనుసంధానంగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూ.573 కోట్ల నిధులను తీసుకురావడంలో తాను ప్రత్యేకంగా కృషి చేసినట్లు ఎంపీ తెలిపారు. ఈ రహదారి ద్వారా పోర్టుకు రవాణా మరింత సులభమవుతుందని అన్నారు.
అలాగే పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అనుబంధ పరిశ్రమలు ఏర్పడటం ద్వారా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. పోర్టుకు అనుసంధానంగా రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టామని, మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
బందర్ పోర్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఎగుమతి–దిగుమతుల పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









