వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం

- February 07, 2026 , by Maagulf
వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం

ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ (20) కొంత పోరాడినా, తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కగా నిలబెట్టాడు. 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అమెరికా బౌలర్లలో షెడ్లీ వాన్ షాల్క్‌విక్ మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుదిపేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com