ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- February 08, 2026
దోహా: వాహన అనుమతి పత్రంలో పేర్కొన్న వాటిని మినహా ఇతర ఏ ప్రయోజనం కోసం అయినా ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ ఖతార్‌లోని వాహన యజమానులకు గుర్తు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందకు వస్తుందని, వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ (5/57) ప్రకారం, మోటారు వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ పత్రంలో పేర్కొన్న వాటిని మినహా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు లేదా అనుమతించకూడదని అని స్పష్టంగా తెలిపింది. ఈ నిబంధనలను రహదారి భద్రతను నిర్ధారించడానికి, దేశవ్యాప్తంగా రవాణా కార్యకలాపాలను నియంత్రించడానికి కఠినంగా అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







