డ్రై నట్స్ చిక్కీ
- February 08, 2026
కావలసినవి:
జీడిపప్పు–ముప్పావు కప్పు
బాదం–ముప్పావు కప్పు
పిస్తా–ముప్పావు కప్పు
పప్పులు–రెండు చెంచాలు
గుమ్మడి గింజలు–రెండు చెంచాలు
నెయ్యి–చెంచా
బెల్లం–కప్పు
నీళ్లు–పావుకప్పు
యాలకుల పొడి–చిటికెడు
తయారీ విధానం :
పాన్‌లో బాదం, పిస్తా, జీడిపప్పులు, గుమ్మడి గింజలు వేసి పది నిమిషాలు దోరగా కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం, పావుకప్పు నీళ్లు పోసి అది కరిగే వరకు బాగా కలపాలి. తరువాత పాన్‌లో నెయ్యి (ghee) వేసి వేడి చేసుకుని అందులో బెల్లం కలిపి ఐదారు నిమిషాల్లో పాకం సిద్ధం అవుతుంది. ఈ పాకాన్ని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు కరిగిపోకుండా గట్టిగా ఉంటే అది నొల్ పాకం అని అర్థం. ఇప్పుడు అందులో వేయించిన డ్రై నట్స్(Dry nuts) కొద్దిగా యాలకుల పొడి వేసి త్వరగా కలపాలి. వెంటనే నెయ్యి రాసిన పళ్లంలో ఈ మిశ్రమాన్ని వేసి, పైభాగంలో కూడా నెయ్యి రాసిన బటర్ పేపరు ఉంచి చపాతీ కర్రతో ఒత్తాలి. ఇలా చేస్తే చిక్కీలు సమానంగా వస్తాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







