గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- February 11, 2026
దోహా: ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ లేఖ్వియా, విజిట్ ఖతార్ మరియు మీడియా సిటీ సహకారంతో స్టేడియం 974లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు అయింది. గిన్నిస్ వరల్డ్ నిర్దేశించిన అన్ని ప్రమాణాల మేరకు 113,169.68 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద తాత్కాలిక క్రీడా వేదికగా రికార్డు సృష్టించింది. జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రవీణ్ పటేల్ కొత్త రికార్డును ప్రకటించారు.
ఈ మేరకు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ లేఖ్వియా ప్రాతినిధ్యం వహిస్తున్న ఖతార్ పోలీస్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ అహ్మద్ బిన్ హమద్ అల్-థానీకి గిన్నిస్ సర్టిఫికెట్‌ను అందజేశారు. >ఈ సర్టిఫికెట్‌ను మీడియా సిటీ తరపున CEO హమద్ ఒమర్ అల్ మన్నాయ్ మరియు విజిట్ ఖతార్ తరపున ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ డైరెక్టర్ అహ్మద్ హమద్ అల్ బినాలి సమక్షంలో ఆయన అందుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







