బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- February 12, 2026
మనామా: బహ్రెయిన్ లో 46 ఏళ్ల మహిళకు మొదటి హై క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. ఓ యూరోపియన్ దేశం నుండి వచ్చిన పోస్టల్ ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్, స్వీట్ల మాటున మాదకద్రవ్యాలను దాచి ఉంచినట్లు గుర్తించిన తర్వాత, అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు.
ఒక కస్టమ్స్ అధికారికి ఆ ప్యాకేజీపై అనుమానం రావడంతో ఎక్స్-రే స్కాన్ చేయగా డ్రగ్స్ దాచిన విషయం బయటపడింది. ప్యాకేజీలోని స్వీట్ల మధ్యలో దాచిపెట్టిన దాదాపు 194 గ్రాముల బరువున్న మారిజునా ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







