ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- February 12, 2026
మస్కట్: ఒమన్ లో పర్యటనలకు సంబంధించి అన్నిసేవలు అందించేలా రూపొందించిన వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఈ మేరకు ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్యంగా ఐరన్‌మ్యాన్ ఛాంపియన్షిప్ కు అనుగుణంగా పర్యాటక ప్యాకేజీల కోసం డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే వారితో పాటు అతిథులు మరియు సందర్శకులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇది స్థానిక పర్యాటక కంపెనీలు మరియు ఫ్లైట్స్, వసతి, రవాణా, టూర్ ఆపరేటర్లు, గైడెడ్ టూర్లు వంటి సమగ్ర సేవలను అందిస్తుందన్నారు. ఈ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం 200 కంటే ఎక్కువ పర్యాటక సర్వీస్ ప్రొవైడర్స్, 350 కంటే ఎక్కువ పర్యాటక ప్రాంతాలు, 56 పర్యాటక ప్యాకేజీలు మరియు 140 కంటే ఎక్కువ హోటల్స్ ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







