యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- February 12, 2026
యూఏఈ: రమదాన్ సందర్భంగా ధరలు పెంచితే భారీ జరిమానా విధిస్తామని రిటైలర్లను ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి Dh100,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి స్పష్టం చేశారు. కొంతమంది రిటైలర్లు చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించారని, సరఫరాదారులు మరియు రిటైలర్లు కుమ్మకై కృత్రిమ డిమాండ్ ను సృష్టించి భారీగా ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. జనవరి 2025లో ప్రవేశపెట్టబడిన కొత్త ధరల విధానం ప్రకారం.. గుడ్లు, పౌల్ట్రీ, వంట నూనెలు, చక్కెర, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు మరియు బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కఠిన నియంత్రణలు అమల్లో ఉంటాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. గత సంవత్సరం రమదాన్ సమయంలో ధరల పెరుగుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ 3,167 ఫిర్యాదులు మరియు 7,702 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







