ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- February 13, 2026
చిత్తూర్: మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బైవీక్లీ సర్కిల్ వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టి లారీ కిందే ఇరుక్కుపోయింది. దీంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కారులో ఉన్న ఆరుగురు లోపలే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాహనాన్ని తెరిచి మృతదేహాలను బయటకు తీశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు (Chittoor) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







