వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- October 02, 2026
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పురుషుల వన్డే ప్రపంచకప్-2027 పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 2న సూపర్ సిరీస్‌తో ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.
ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, జింబాబ్వే, క్వాలిఫయర్-ఎ ఉండగా.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-బి జట్లు ఉన్నాయి.
భారత్ మ్యాచ్‌ల వివరాలు
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 7 కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 10న జోహాన్స్‌బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.
ఆ తర్వాత అనంతరం అక్టోబర్ 14న అఫ్గానిస్తాన్, అక్టోబర్ 17న క్వాలిఫయర్-ఎ జట్టుతో, అక్టోబర్ 24న జింబాబ్వేతో గ్రూప్ దశ మ్యాచ్‌లను ఆడనుంది. 2023 ప్రపంచకప్‌లో తుది మొట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని కసితో ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







