బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌..!!

- February 15, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో ముగిసిన  ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌..!!

మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బహ్రెయిన్ 2026 ముగింపు వేడుక జనరల్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సమక్షంలో జరిగింది. ఈ ఛాంపియన్‌షిప్‌ను బహ్రెయిన్ బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ ఫెడరేషన్ సహకారంతో బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్‌ను ఆతిథ్యం ఇచ్చిన మిడిలీస్టులో మొదటి దేశంగా బహ్రెయిన్ నిలిచి చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో జనరల్ స్పోర్ట్స్ అథారిటీ CEO డాక్టర్ అబ్దుల్‌రెహ్మాన్ సాదిక్ అస్కర్, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ దువైజ్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ అలీ బిన్ మొహమ్మద్ అల్ మజీద్ పాల్గొన్నారు.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com