ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం
- February 15, 2026
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుంచే లోన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే,(Phone Pay) తన వినియోగదారులకు తక్షణ రుణ సేవలను అందిస్తూ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చే మార్గాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పే పలు బ్యాంకులు, NBFC సంస్థలతో భాగస్వామ్యం చేసుకొని సులభమైన ప్రక్రియతో పర్సనల్ లోన్స్ అందిస్తోంది. ఈ రుణాలకు ఎలాంటి ఆస్తి పూచీకత్తు అవసరం లేకుండా, ఆదాయం మరియు క్రెడిట్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు.
లోన్ ముఖ్య వివరాలు
రుణ మొత్తం: రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు
వడ్డీ రేటు: వార్షికంగా సుమారు 11.3% నుంచి 35% వరకు
తిరిగి చెల్లింపు కాలం: 12 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు
డబ్బు జమ: దరఖాస్తు ఆమోదం తర్వాత 72 గంటల్లో బ్యాంక్ ఖాతాలోకి జమ
ఎవరు అర్హులు?
వయస్సు: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య
నెలవారీ ఆదాయం: కనీసం రూ.15,000
క్రెడిట్ స్కోర్: 650 కంటే ఎక్కువ ఉంటే అర్హత మెరుగవుతుంది
అవసరమైన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, జీతం స్లిప్స్
లోన్ అప్లై చేసే విధానం
ఫోన్‌పే యాప్‌లో Loans విభాగంలోకి వెళ్లి, మీ(Phone Pay) వ్యక్తిగత వివరాలను నమోదు చేసి అర్హతను చెక్ చేసుకోవాలి. కావాల్సిన లోన్ మొత్తం, కాలపరిమితిని ఎంపిక చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. సకాలంలో EMIలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది, తద్వారా భవిష్యత్తులో పెద్ద లోన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. అత్యవసర వైద్య ఖర్చులు, చిన్న వ్యాపార అవసరాల కోసం ఈ ఇన్‌స్టంట్ లోన్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







