రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- February 15, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ ద్వారా బెదిరింపు అందడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టగా, బాంబు లభ్యం కాలేదు.
నకిలీ బాంబు బెదిరింపు కాల్స్
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







