టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- February 15, 2026
మనామా: బహ్రెయిన్ లోని రాయల్ మెడికల్ సర్వీసెస్ కొత్త అంతర్జాతీయ మైలురాయిని సాధించింది. కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్ ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీ హాస్పిటల్‌లలో స్థానం సంపాదించింది. ఈ హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా 73వ స్థానంలో నిలిచింది. "బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ టాప్ 250 హాస్పిటల్స్ 2026" ర్యాంకింగ్‌లో భాగంగా ఈ గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు రాయల్ మెడికల్ సర్వీసెస్ మరియు దాని అనుబంధ వైద్య సంస్థల పెరుగుతున్న స్థాయిని ప్రతిబింబిస్తుందని రాయల్ మెడికల్ సర్వీసెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ ఫహద్ బిన్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. వైద్యం, చికిత్సా, విద్యా మరియు పరిశోధన సేవలలో మెరుగైన ఫలితాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పెంచడం, వైద్య విద్య మరియు పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఆసుపత్రి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







