ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- February 15, 2026
రియాద్: మొత్తం 1,028 ప్రభుత్వ మరియు సెమీ-ప్రభుత్వ సంస్థలు అర్హత కలిగిన సౌదీయేతర ఉద్యోగులను ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ కింద ఆమోదించారు. 3,484 ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం ఆమోదం తెలిపారు. వీటిల్లో పనిచేసే ఉద్యోగులు కూడా అదే రెసిడెన్సీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎక్సెప్షనల్ టాలెంట్ నివాసం కలిగి ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రవాస మరియు ఆధారపడిన రుసుముల నుండి మినహాయింపుతోపాటు వీసా లేకుండానే అపరిమిత ఎగ్జిట్ మరియు ఎంట్రీలు వంటి స్పెషల్ అవకాశాలను పొందవచ్చు.
రీసెర్చ్ ప్రాధాన్యతా స్పెషలైజేషన్‌లో వర్క్ కాంట్రాక్ట్, కనీస నెలవారీ జీతం SR14,000, కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి . మూడు ప్రత్యేక పరిశోధనా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. శాస్త్రీయ మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రాధాన్యతా రంగంలో వర్క్ కాంట్రాక్ట్ కలిగి ఉండాలి. నెలకు కనీసం SR35,000 సంపాదించాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఇక ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ పరంగా చూస్తే.. ఇందులో ప్రభుత్వ లేదా సెమీ-ప్రభుత్వ సంస్థలలో మొదటి మరియు రెండవ-స్థాయి లీడర్ షిప్ స్థానాల్లో ఉండాలి. దరఖాస్తుదారులు నెలకు కనీసం SR80,000 సంపాదించాలి. వారి యజమాని నుండి అధికారిక సిఫార్సు లేఖను అందించాలి. రెసిడెన్సీ ఐదు సంవత్సరాల పాటు మంజూరు చేయబడుతుంది. అర్హత ప్రమాణాలు నెరవేరినట్లయితే, కనీసం 30 నెలల తర్వాత శాశ్వత నివాసానికి మారవచ్చు. ఇందుకు రుసుము కింద SR4,000 చెల్లించాలని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







