తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- February 15, 2026
అబుదాబి: ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని శనివారం అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు హెచ్ హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా మిడిలీస్టులోని పరిస్థితిని సమీక్షించారు. సమస్యలను ఎదుర్కొవడానికి సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. పలు సమస్యలకు దౌత్య పరమైన చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తద్వారా శాంతిని కొనసాగించడానికి మరియు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి అవకాశాలను పెంచడానికి దోహదపడే అనేక కార్యక్రమాల్లో సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని ఖతార్ అమీర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







