మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- February 17, 2026
హైదరాబాద్: 2022లో మేడ్చల్ మల్కాజిగిరిలో బంగారు నగల (Gold) కోసం గుడికి వచ్చిన ఓ మహిళను ఆలయ పూజరి దారుణంగా హత్య చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన దారుణ హత్యకు పాల్పడ్డాడు. నగలు దోచుకొని మృతదేహాన్ని మూడ్రోజుల పాటు గర్భగుడిలోనే ఉంచి ఆ తర్వాత మాయం చేశాడు. తాజాగా జిల్లా కోర్టు హత్య చేసిన పూజారికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా బాల సుబ్బయ్య నగర్‌కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉండేవాడు. స్థానికంగా ఉన్న స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా విధులు నిర్వహించేవాడు. అయితే మురళీకృష్ణ చెడు వ్యసనాలకు అలవాటు పడి లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక చోరీకి ప్లాన్ చేశాడు.
విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి ప్రతి రోజూ ఆలయానికి వచ్చేది. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై పూజారి మురళీకృష్ణ కన్నుపడింది. ఆ నగలు దొచుకునేందుకు ఛాన్స్ కోసం వేచి చూశాడు. అదే ఏడాది ఏప్రిల్ 18 రాత్రి 7.30 గంటలకు ఆలయానికి వచ్చిన ఉమాదేవిని గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆమె లోపలికి వెళ్లి దేవుడికి దండం పెడుతుండగా ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఐరన్ రాడ్డుతో తలపై మోది దారుణంగా హత్య చేశాడు.
తాజా వార్తలు
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!









