పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష
- February 20, 2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఈరోజు Public Accounts Committee (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు Vallabhaneni Balashowry పాల్గొన్నారు.
సమావేశంలో SANKALP (Skill Acquisition and Knowledge Awareness for Livelihood Promotion) పథకం అమలు విధానాలు, పారదర్శకత, నిధుల వినియోగం, లక్ష్య సాధన పై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ పథకం పాత్రను సభ్యులు సమీక్షించారు.
ఈ సమావేశానికి స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ తరఫున సెక్రటరీ మిస్ దేభాషిణి ముఖర్జీ, అడిషనల్ సెక్రటరీ నిరంజన్ కుమార్ సుభాన్షు, జాయింట్ సెక్రటరీ మిస్ హీరా ఉస్మా హాజరయ్యారు. అలాగే National Institute for Micro, Small and Medium Enterprises (NIMSME) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, National Skill Development Corporation (NSDC) జనరల్ మేనేజర్ సలీల్ నాగ్ పాల్ పాల్గొన్నారు.
ఇక Comptroller and Auditor General of India (C&AG) కార్యాలయం నుండి డిప్యూటీ CAG ఆనంద్ బజాజ్, అదనపు CAGలు సమర్ కాంత్ ఠాకూర్, సోరబ్ కుమార్, డైరెక్టర్ జనరల్ గురువిన్ సిద్ధూ, డైరెక్టర్ కరణ్ వోహ్ర తదితర ఉన్నతాధికారులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సమావేశంలో పథక అమలులో పారదర్శకత, ఫలితాల మూల్యాంకనం, నైపుణ్య శిక్షణలో నాణ్యత ప్రమాణాలు, నిధుల సమర్థ వినియోగం వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిగింది. యువత ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







