మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- February 21, 2026
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ' భవనాన్నిఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆవిష్కరించనున్నారు. మాజీ పరిశ్రమల శాఖ మంత్రి స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి వర్ధంతి సందర్భంగా రూ.1.4కోట్లతో ఏర్పాటు చేసిన భవనం శనివారం ప్రారంభోత్సవం జరగనుంది. ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతన మహాబోధి సొసైటీ , ఏయూ సంయుక్తంగా నిర్వహించే ఈ కేంద్రానికి మే,2023లో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. విశాఖ నగరం మధ్యలో ప్రజలకు ఉపయుక్తంగా సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో గౌతం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతం సతీమణి శ్రీకీర్తి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి, గౌతం సోదరుడు పృథ్వీ తదితర కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
నియోజకవర్గంలోనూ విస్తృత సేవా కార్యక్రమాలు
కీర్తిశేషులు మేకపాటి గౌతంరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, గౌతంరెడ్డి అభిమానులు నివాళి అర్పించనున్నారు. ఉదయం 10.30గం.లకు ఆత్మకూరులోని ఎంజీఆర్ మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







