గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- February 21, 2026
మనామా: బహ్రెయిన్ కు చెందిన రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) పాలస్తీనా ప్రజలకు నిరంతర మానవతా సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయ సామాగ్రిని అత్యవసరంగా పంపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆపరేషన్ “గాలెంట్ నైట్ 3” మరియు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఎయిర్‌లిఫ్ట్ ద్వారా సహాయాన్ని తరలిస్తున్నారు.
ఈ అత్యవసర సహాయంలో మహిళలు మరియు పిల్లలకు అంకితమైన ఆరోగ్య సంరక్షణ సామాగ్రి, అవసరమైన ఆహార పదార్థాలు, మందులు మరియు క్షేత్రస్థాయిలో దిగజారుతున్న మానవతా పరిస్థితిని తగ్గించడానికి ఉద్దేశించిన వైద్య పరికరాలు ఉన్నాయని RHF గౌరవ అధ్యక్షుడు హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో సహాయాన్ని పంపడం ప్రత్యేకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలకు బహ్రెయిన్ ప్రజలు ఎప్పుడు సంఘీభావంగా ఉంటారని వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







