హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- February 24, 2026
మనామా: హమద్ టౌన్ మరియు జనబియా రోడ్‌లోని కీలక ప్రాంతాలలో భద్రతాపరమైన చర్యలను వేగవంతం చేశారు. ఇక్కడ కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేలోని రౌండ్అబౌట్ 6 మరియు రౌండ్అబౌట్ 14 వద్ద టన్నెల్స్ లోపల కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. రద్దీగా ఉండే ఈ టన్నెల్ మార్గాలలో భద్రతాపరమైన పర్యవేక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా అల్ దోసరి ఈ ప్రతిపాదనను సమర్పించారు.
అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డ్ చేయడానికి మరియు ప్రమాదాలు లేదా వాహనాల బ్రేక్‌డౌన్‌లు, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలలో అత్యవసర రెస్క్యూ టీమ్స్ వేగవంతంగా స్పందించేందుకు సేఫ్టీ కెమెరాలు సహాయపడతాయని వెల్లడించారు. అలాగే, సల్మాన్ సిటీ వైపు 91, 92 మరియు 93 రోడ్లను కవర్ చేస్తూ జనబియా రోడ్ వెంట పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కౌన్సిల్ సమీక్షించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







