యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ‘B3’ మూవీ..
- February 27, 2026
దర్శకుడు నానిరాజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ B3. VVS క్రియేషన్ బ్యానర్‌లో శ్రీరంగం సతీష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణ నేడు(ఫిబ్రవరి 27) ఫిల్మ్ ఛాంబర్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మలప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు & తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నానిరాజ్ గత 9 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా పని చేశాడు. ఆలాగే, షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ B3(B3 Movie) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కామెడీ అండ్ యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే, ఈ సినిమాను ఆయనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మార్చి నుంచి జూన్ వరకు జరుగనున్నాయి. అలాగే ఈ సినిమాలో, అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఇంకా ఈ సినిమాకు సురేష్ ఆత్రేయ డిఓపిగా, శ్రీను ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







